కొత్త రాముని యాత్రలు: తెలుగు ప్రజల మనోగతం
హైదరాబాదులో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న హనుమాన్ యాత్రలూ, ఈ సంవత్సరం మొదలయిన రాముడి శోభా యాత్రా అనేకమంది తెలుగు వారిని అయోమయానికి గురిచెస్తున్నయి. ఒక పక్క కొత్త ఆశలు చిగురిస్తుంటే ఇంకో పక్క, కొంతమంది గందరగోళా నికి కూడా లొనవుతున్నరు. రాముడితో, హనుమంతుడితో తర తరాలుగా రక రకాల బంధాలూ అనుబంధాలూ ఏర్పరచుకున్న తెలుగు వారి మనోగతాన్ని ఒకసారి విందాం.
1) రామ భక్త కోటి: మొదటిది గా చెప్పుకోవాల్సింది రామ భక్త కోటి బాధ గురించి. శ్రీ రామ నవమి అంటే ఇంట్లో, పక్కింట్లో వీధి గుళ్ళో పానకం, వడ పప్పు సేవించి, సీత రామ కళ్యాణం తిలకించి, ఇంకా భక్తితో రేడియో లోనో టీవీ లోనో, భద్రాచలంలో జరిగే రామ కళ్యాణం వినటం, చూడటం వీరి అలవాటు. రాముడి మీద భక్తిని రామ దాసు కీర్తనలు విని పాడి ఇంకా ఎక్కువయితే రామకోటి రాసి నిరుపించుకోవటం కూడా వీరికి మామూలే.
అయితే ఇప్పుడు తమ రామభక్తిని నిరుపించుకోవటానికి ఇవి చాలవేమో అన్న భయం వీరిని ఆందోళనకు గురిచేస్తోంది. తామిన్నాళ్ళూ క్రమం తప్పకుండ శ్రీనామ నవమి జరుపుకుని కూడగట్టుకున్న పుణ్యం అంతా ఏమయిపోతుందో అన్న భయం పట్టుకుంది వీళ్ళకి. ఈ యాత్రల్లో పాల్గొనకపోతే తమని రాముడు భక్తులుగా పరిగణించడా? ఇలా రామభక్తిని నిరుపించుకోవాలంటే, తమలో వయసు మీద పడిన వారికెలా సాధ్యమవుతుంది? తాముకూడా ఈ యాత్రల్లో పాల్గొనటానికి ఎం చెయ్యాలి? ఇంతకీ, ఈ యాత్రల్లో ఊరేగుతున్నది భద్రాచల రాముడా లేక అయోధ్య రాముడా? హైదరాబాదులో ఈ యాత్రలకి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం ఇక భద్రాచలంలో సీతారామ కళ్యాణం నిర్వహించటం మానేస్తుందా? అప్పుడు భద్రాచల రాముడి పరిస్థితి ఏమిటి? అంతే కాక, తాము రాసిన రామ కోటి పరిస్థితేమిటి? దాన్నిప్పుడు భద్రాచలంలో సమర్పించాల? లేక ఈ కొత్త యాత్ర తమ కాలనీకో, గల్లీకో వచ్చినపుడు సమర్పించేసేయ్యలా?
హనుమంతుడు, రాముని బంటని బలంగా నమ్మిన వారు కాబట్టి 'హనుమాన్ యాత్రల' పట్ల కూడా వారికి సందేహాలు వస్తున్నాయి. రాముని ప్రమేయం లేకుండా ఒంటరిగా హనుమంతుడు తనంతట తానూ యాత్రలు చెయ్యచ్చా? అది సరయినదేనా? రాముని బంటయిన హనుమంతుడు కూడా రామనవమినాదె యాత్ర చెయ్యచ్చు కదా, వేరే ఎందుకు చేస్తున్నట్లు?
రాముడిని, సీతా రాముడు, జానకి రాముడు, దశరధ రాముడు, కౌశల్య రాముడు అని మాత్రమె పిలుచుకుని, అవే పేర్లు పిల్లలకి పెట్టుకునే అలవాటున్ నతెలుగు ప్రజలకి సీతా రామ కల్యాణం రోజున సీతతో పాటు, పెళ్లి కళతో కనిపించాల్సిన రాముడు, సీత లేకుండా బాణాలు పట్టుకుని 'మిలటరీ రాముడులా' కనిపించటం అశుభం కాదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి.
ఏది ఏమయినా ఈ సందేహాలు తీర్చుకునేందుకు, తమ వంటి వారికి, ముఖ్యంగా వయసు మళ్ళిన వారికి యాత్రల్లో పాల్గొనేందుకు ప్రత్యెక అవకాశాలు కల్పించాలని అడిగేందుకు వీరు సిద్ధమవు తున్నారు.
రాముణ్ణి ఆదర్శ పురుషుడని విశ్వసించే ప్రజలు:
తతరాలుగా రాముణ్ణి తెలుగువారు ఆదర్శ పురుషుడని నమ్ముతూ వచ్చారు. భర్త రాముడిలా ఏక పత్నీ వ్రతుడు కావాలనీ, భార్య సీతలాగా ఎన్ని కష్టాలు వచ్చినా భర్తనే నమ్ముకుని ఉండాలనీ స్త్రీలూ, పురుషులూ కూడా నమ్మారు. తమ కొడుకులు ఈ యాత్రల్లో పాల్గొంటే గమనిస్తున్న ఈ తల్లితండ్రుల మనోభావాలు చూద్దాము. టీవీ, సినిమాలు చూసి చెడిపోతున్న మగపిల్లలందరూ ఈ యాత్రల్లో పాల్గొని కొంచమయినా భక్తిని నేర్చుకున్తారనే ఆశ వీరిలో చిగురించింది. అంతే కాదు, ఆ భయం, భక్తీ తమ పట్ల కూడా ప్రదర్శించేతట్లు చూడు రామయ్య అని, మనుసులోనే అనేక దణ్ణాలు పెట్టుకుంటున్నారు కూడా. అయితే, ఇంతమంది యువకులు కలిసినప్పుడు, రాముడి పెరుమీదయినా సరే, జరిగే అనర్ధాల గురించి కూడా వారికి తెలుసు. తమ పిల్లలు, తల్లి తండ్రులంటే భక్తీ, భయం కలిగిన దశరథ రాముడిలా కాక, రావణుడి మీద యుద్ధాని కెళ్ళిన ఉగ్ర రాముడిలా తయారయితే ఎలా అనే భయం వీళ్ళకి పట్టుకుంది. సరయిన పనికీ, నచ్చని పనికీ తేడ తెలియని వయసు కదా వీరిది, తమకి నచ్చని వారిమీద, ఈ యాత్ర స్పూర్తితో అనవసర తగవులకీ, గొడవలకీ దిగారు కదా పిల్లలు అన్న సందేహంతో సతమథమవుతున్నారు.
యాత్రల్లో తిరుగుతున్న పెళ్ళయిన యువకుల భార్యలు మనోగతం వేరేలా వుంది. తమ భర్తలకి కూడా రాముడి లాగా ఏక పత్నీ వ్రతం రావాలనీ, పరాయి స్త్రీల పట్ల చూడని నిబద్ధత రావాలనీ వారు ప్రార్ధిస్తున్నారు. అయితే, వారి భయాలు వారికున్నయి. ఈ ఆదర్శంతో పాటు, గర్భవతని కూడా చూడకుండా, పరాయివాళ్ళ మాటలు విని భార్యని ఇంట్లోంచి వెళ్ళ గొట్టిన 'ఆదర్శం' కూడా నేర్చుకుంటారా తమ భర్తలు, సీతలాగా తాము కూడా పరాయి వారి పంచన, వొంటరిగా పిల్లల్ని పెంచుకుంటూ జీవితం వేల్లదియ్యల్సిన పరిస్తిలులు వస్తాయా? అంతే కాదు ఇరవయ్యోకతో శతాబ్దపు విలువలకు, రామాయణ విలువలకూ మధ్య వున్నా అంతరాలు కూడా వారిని అయోమయానికి గురిచెస్తున్నయి. సీతని రాముడు తరిమేస్తే ఆమె అడవికెల్లింది కానీ, ఇప్పుడు మరి కుటుంబ హింస నిరోధక చట్టం వచ్చింది కదా, సీతకి లేని వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తోంది కదా తమకు? మరి ఈ తరం స్త్రీ గా ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాల లేదా? రాజ్యం కోసమే భార్యను వదిలేసినా రాముణ్ణి ఆ నాటి సీత గౌరవించిన్ది కానీ, స్త్రీలకి కూడా, చీమూ నెత్తురు కోరికలూ ఉంటాయని భావించే సమాజంలో పుట్టి పెరిగిన తాము అటువంటి భర్తలనెందుకు గౌరవించాలి? ఇంతకీ, అసలు రాముడు ఈ శతాబ్ద స్త్రీలకూ ఆదర్శ పురుషుడేనా? మరి ఇటువంటి సందేహాస్పదమయిన ఆదర్శ పురుషుడి కోసం, తమ భర్తలెందుకు యాత్రలు చేస్తున్నారు?
ఈ సారి యాత్రలో, పిల్లల్ని తల్లి త్రండ్రులు లేకుండా అనుమ తించొద్దని తల్లి తండ్రులూ, భర్తల్ని ఇటువంటి సందేహాస్పద యాత్రల్నుండి వెనక్కి లాగాలని భార్యలూ ప్రతిపాదనలూ, నిర్ణయాలూ తీసుకుంటున్నారు.
రాముడితో పోరాడిన జనం:
వీరు రాముడు పోరాడి వోడించిన జనం - రావణుడు, అయన అనుచరులు, వారసులు. ఈ దేశంలో ఆదివాసీలు, దళితులు, బహుజనులు. తరతరాలుగా వచ్చిన జ్ఞాపకాలూ తాతలు, తండ్రులు చెప్పిన కధల తో, తమని తాము రావణుడి వారసులుగా భావించుకున్న తరం వారి ఆలోచలను ఇలా సాగుతున్నాయి. రాముడ ట, రాముడు! మా తాత, ముత్తతల్ని చంపి, తన రాజ్యాన్ని స్థాపించుకున్న రాముడి కోసం యాత్రలా? మమ్మల్ని రాక్షసులుగా చిత్రీకరించి తర తరాలుగా తొక్కి పట్టి మా చరిత్రను వక్రీకరించి మమ్మల్ని మాక్కాకుండా చేసిన రామాయణం, రాముడూ మాకెట్ల ఆడర్శమవుతాడు? మా తాటకిని చంపి, మా శుర్ఫనక ముక్కు కోసిన రాముడికి మేము జై కొట్టాలా? ఏ పనులు ఈ రోజు తప్పని చెప్తున్నమో - స్త్రీలని హింసించటం, కురూపులని చెయ్యటం అత్యాచారాలు చెయ్యటం - ఆ పనులన్నీ చేసిన రాముడి కోసం యాత్రలు చెయ్యటం ఎంత సిగ్గుచేటు?
కానీ, వారికి రామ యాత్రల్లో చేరుతున్నఈ తరం యువకులని చూసి ఏమి చెయ్యాలో పాలుపోవట్లేదు. ఏమయిపోయింది ఈ యువకులకి? తమ వారసత్వాన్నేట్లా మరచిపోతున్నారు? శత్రువులతో ఎందుకు చేయి కలుపుతున్నారు? అధికారం రావాలంటే, ఈ యాత్రల్లో పాల్గొనటం తప్పదను కుంటున్నారా? అధికారం వచ్చేవరకూ వాడు కుంటారని, మనలో మనం (విభీషణుడు, రావణుడు మధ్య కొట్లాటలు పెట్టినట్లు) కొట్టుకునేతట్లు చేస్తారనీ వీరికి అర్ధం కావట్లేదా? అధికారం ఇచ్చినట్లే ఇచ్చి, తమ పేరు మీద వారు రాజ్యం చేస్తారని ఈ యువకులకేందుకు అర్ధం కావట్లేదు?
తాటకి, శూర్ఫనక వారసులు గా తమని తాము చూసుకుంటున్న స్త్రీల ఆలోచనలు వేరే రకంగా సాగుతున్నాయి. అడవులని బ్రాహ్మల నుండి కాపాడి తమ ప్రజలకి అందించాలని పోరాడిన తాటకినే సంహరించాడు కదా రాముడు, మరిప్పుడు తమ తమ సమూహాల కోసం పోరాడుతున్న దళిత, బహుజన, ఆదివాసి స్త్రీలనెట్లా రక్షిస్తాడు? అసలు రాముడికి లేని విలువలు రామసేన కెలా వస్తాయి? రామ సేనలలో చేరుతున్న తమ్ముల్లనీ, అన్నలనీ ఎలా బయటికి లాగాలి? మగవారి అనుమతితో సంబంధం లేకుండా, స్త్రీలు తమ ఇస్టాన్ని వ్యక్తీకరించే సంస్కృతికి వారసురాలయిన తమ శూర్ఫణక వారసత్వాన్ని ఈ రామ సేనలు ఒప్పుకుంటాయా? లేక, నువ్వు తప్పు చేస్తున్నావ్ అని ఆవిడని కురూపిని చేసిన రాముడి సంస్కృతిని తిరిగి తెస్తాయా? నీ స్వేచ్చని, పరిధిని, పరిమితుల్ని మేము నిర్ణయిస్తాము మీకు గీతల్ని గీయల్సింది మేమే అని అంటాయా? మన గీతల్ని మనం గీసుకునే సమయం వచ్చిందని కాదూ, మొన్నకి మొన్నమనము నిర్భయ సంఘటన తరువాత అందరికీ అరచి చెప్పిందీ? అన్ని ఆధిపత్యల్ని పడ గొట్టాలని పోరాడుతున్న మనల్ని కొత్త గీతల్లోకి, పరిమితుల్లోకి, ఆధిపత్యంలోకి లాగరు కదా, ఈ కొత్త రాముడి అనుచరులు?
పాత తరం నాయకులందరూ ఈ యాత్రలని వ్యతిరేకించాలనీ, మిగతా స్త్రీలేమో రామ యాత్రలు చేస్తున్న రామ సేనలను, వారి నాయకులను, అడిగి, చర్చించి తమ సందేహాలు తీర్చుకుందామని తీర్మానించుకున్నారు.
ఇంతకీ, రాముడేమను కుంటున్నాడు? అయ్యో! నేనేదో త్రేతాయుగంలో నాకు తెలిసిన ధర్మం, న్యాయం ఏదో అమలు చేస్తే, వీల్లిప్పటికీ, దాన్ని, నన్ను పట్టుకునింకా ఎందుకు వేల్లాడుతున్నారు? కొత్త యుగాలకి, కొత్త ధర్మాలు, కొత్త శాస నాలు, కొత్త లోక పురుషులూ, కొత్త ఆదర్శాలు ఉండాలి కదా? ఈ యుగంలో కూడా నన్ను, నా ధర్మాన్నే కావాలనుకుంటున్న ఈ వింత మనుషులు ఎవరబ్బా? అని తల పట్టుకుని దీర్ఘాలోచనలో పడ్డాడు.
సీత రామ వెంకట సునీత
Comments
Post a Comment