ఏది సార్వత్రిక సత్యం?
మెర్సీ మార్గరెట్ రాసిన
కవిత
చాలామందిని కలవర
పెట్టింది. క్లుప్తంగా చెప్పాలంటే ఒక
మతాన్ని కించ
పరిచి
మరొక
మతాన్ని పైకెత్తిందని ఆమెపై
ప్రధాన
ఆరోపణ.
ఇది
మన
దేశంలో మైనారిటీ మతాలనయితే ఆ కవితని దేశ
భక్తి
కవితగా
బహుశా కీర్తించి ఉండేవారు. దురదృష్ట వశాత్తు ఆమె కవిత మెజారిటీ మతంపై
విమర్శని ఎక్కుపెట్టింది. అదీ
ఒక
అణగారిన కుల
అస్తిత్వానికి చెందిన
మహిళగా.
ఇది
రెండు,
మూడింతల నేరం.
నోరు
మూసుకుని పడుండాల్సిన వాళ్ళు,
అదీ
ఆధిపత్య కులాల
వారి
ఇళ్లల్లో, దేవాలయాల్లోకి ప్రవేశించటానికి కూడా
అర్హత
లేని
వాళ్ళు,
ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చిన
మత
స్వేచ్చని ఇలా దుర్వినియోగం చేయటంతో సహజంగానే తీవ్రంగా కలవర పడిన కొంత
మంది ప్రత్యక్షంగా సైబర్ వేధింపులకు పాల్పడ్డారు. చంపుతామని, అత్యాచారం చేస్తామనే బెదిరింపులు మాత్రమే కాకుండా అతి
అసహ్యమైన కుల
దురహంకార, స్త్రీ
ద్వేష,
రేసిస్ట్ తిట్లు
ఆమెకి
మెసేజీల ద్వారా
పంపారు.
ఆమె
కులంపై,
మతంపై,
శరీరంపై చెప్పరాని మాటలు
అంటూ తమ కుల, మత,
లింగ
ఆధిపత్యాన్ని తద్వారా పునరుద్ఘాటించుకున్నారు. వీరిలో ఆధిపత్య కుల స్త్రీలు తమ పురుషులతో పోటీ
పడి
మెర్సీ
ని
వేధించటం, కించపరచటంలో లింగ
సమానత్వం సాధించేసుకున్నారు కూడా.
ఆమె కులం, మతానికి చెందిన
ఒకరిద్దరు ప్రగతి
శీల
పురుషులు కూడా మెర్సీ కి, ఇలాంటి
కవిత
రాసినందుకు, తగిన
శాస్తి
జరగాలని భావించారు. వీరి
ఉద్దేశంలో ఆమె
తన
హద్దులు మరిచి,
ఈ సమయంలో పర మత
దూషణకి
పాల్పడింది. అంటే
ఆమె
మౌలికంగా ఒక
మైనారిటీ మత
స్త్రీ
గా
ప్రవర్తించాల్సిన రీతిలో
అణకువగా ప్రవర్తించకుండా గీచిన
గీత
దాటింది. ఇటువంటి ధిక్కార ప్రవర్తనకి పాల్పడిన స్త్రీలని సంరక్షించాల్సిన అవసరం
లేదు.
ఆమె
తన
తప్పుకు సరయిన
శిక్ష
అనుభవించాల్సిందే. అని
బహింరంగంగా ప్రకటించేశారు కూడా.
అలా
తమ
పురుషాధిక్యతని తాము
పునరుద్ఘాటించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని అభ్యుదయ వాదులు అందరూ ఇటువంటి బహింరంగ దాడులని గట్టిగానే ఖండించారు. ముఖ్యంగా అన్ని
వాదాలకి చెందిన సాహితీ కారులందరు ఆమె
వెనకే
నిలిచారు. ఈ రకంగా
ఆమెపై
వేధింపులకు పాల్పడటం ఆమె గొంతు నొక్కటమే కాక
అందరికీ కావాల్సిన భావ
స్వేచ్ఛని అణగదొక్కటమే అని
నొక్కి
చెప్పారు. ఆమెకి, ఆమె
రాసే
స్వేచ్చకీ మద్దతు
తెలిపారు. అయితే
మద్దతు
ప్రకటించిన వారిలో
ముస్లిం వాదులు,
దళిత
వాదులు
నిఖార్సయిన మద్దతు
ప్రకటిస్తే, మెర్సీ పట్ల,
ఆమె కవిత పట్ల, ఆమె
రాసిన
ఉద్దేశం పట్ల
ఆమె
భావ
స్వేచ్చని సమర్ధించిన అభ్యుదయ వాదుల్లో చాలా కలవరం కనిపించింది. అయ్యో
ఇప్పుడెందుకు రాసింది అనుకున్న వాళ్ళ
నుండి,
ఎదో
రాయబోయి మరేదో
రాసిందనుకుంటా నని
అన్న
వాళ్ళు,
పరాయి
మతాన్ని విమర్శించటమెందుకు అన్న
వాళ్ళ
దగ్గర్నించి, ఏ మతమయినా చెడ్డదే కాదూ, మత మార్పిడిని సమర్ధించే కవిత
రాసిన మెర్సీ , క్రిస్టియన్ నని
గర్వంగా చెప్పుకునే ప్రగతిశీల రచయిత్రిగా ఎలా
పరిగణించాలనే మీమాంస
వరకు
అనేక
సందేహాలతో అందరూ అంతర్గతంగా సత మతమవుతున్నారు. తమ
తమ
ఎఫ్బి
పోస్టుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో ఆయా
విమర్శని వ్యక్తపరిచారు. ఇవన్నీ న్యాయమయిన ప్రశ్నలే, వేసుకోవాల్సిన ప్రశ్నలే కూడా. అయితే ఇవన్నీ కూడా దేశంలో గత రెండు
దశాబ్దాలలో తీవ్రంగా ప్రబలిపోయిన మెజారిటి వాదం నేపథ్యంలో ఏర్పడిన సందేహాలు కాదా అనే ప్రశ్న
కూడా
వేసుకోవాల్సిన అవసరం
వుంది.
అన్నిటికన్నా మొదటిది ఈ విమర్శల్లో మెర్సీ
క్రిస్టియన్ అస్తిత్వాన్ని, ఆమె
రచయిత
అస్తిత్వాన్ని కలిపెయ్యటం. ఇంతకు
ముందు
ఆమె
తన
రచనల్లో వాడుకున్న ప్రతీకలు అన్నీ
తెలుగు
సాహిత్య సంప్రదాయంలో భాగమే
అయినప్పటికీ, ఆమె
ఈ కవితలో సీత, రాముడు
అనే
పేరు
గల వ్యక్తుల గురించి మాట్లాడంగానే వెంటనే ప్రగతిశీల వాదులతో సహా అందరికీ ఆమె రచయిత అస్తిత్వం కాక
క్రిస్టియన్ అస్తిత్వమే కనపడింది. ఎందువల్ల? సీతకి
వచ్చిన
కస్టాలు నీకు
రాకూడదు తల్లి
అనటం
చిన్నతనంలో కొన్ని
తరాల వాళ్ళకి రోజువారీ సంస్కృతిలో భాగం. తెలుగు సాహిత్య పరంగా
సీత తరతరాలుగా స్త్రీల అణచివేతకె కాక ఆధునిక స్త్రీ
వాద ప్రతీకగా ఉంటూ వచ్చింది. రంగనాయకమ్మ దగ్గరి
నుండి,
హేమలత,
ఓల్గా
వరకు
సీతకి
పలు
రకాల వ్యక్తిత్వాన్ని కలిపించారు. ఒక కధలో సీత
రావణుడితో ఉండిపోతే, మరొక
కధనంలో
సీత
తల్లి
(భూమి)
దగ్గరికి వెళ్ళిపోతుంది. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకున్న మెర్సీ
ఇటువంటి సాంస్కృతిక ప్రతీకని కవితలో
వాడుకుని ఒక
సాధారణ సీత సామాన్య రాముడి
బాధలని
తట్టుకోలేక చర్చికి వెళ్లిందంటే ప్రగతిశీల వాదులు
కూడా ఆమెని తెలుగు రచయితగా కాక,
ఆమె మతానికి ప్రతినిధిగా చూడటం ఏ విధంగా
అర్ధం
చేసుకోవాలి?
మెర్సీ తనని తాను
క్రిస్టియన్ గా
చెప్పుకోవటం తమని
తాము
మతానికి అతీతంగా ప్రకటించుకున్న అభ్యదయ వాదులకి మింగుడు పడట్లేదు. దీనికి మత అస్తిత్వం, లౌకికవాదం, ప్రగతి శీలతల
మధ్యవున్న సంబంధం
గురించి, ముఖ్యంగా వామ
పక్ష
వాదులమని చెప్పుకునే వారికి
వున్న
అస్పష్టత కొంత
కారణంగా కన్పిస్తుంది. మత అస్తిత్వానికి, ప్రగతి
శీలతకి
పరస్పర
వైరుధ్యం లేదని
చెప్పటానికి మనకి
చరిత్రలో అనేక
ఉదాహరణలు కన్పిస్తాయి. అలాగే, దేవుణ్ణి నమ్మని వారందరు ప్రజాస్వామ్య వాదులు
అనటానికి ఏ సాక్ష్యాలు లేవు. లౌకికవాదానికి, మతాలకి వున్న సంబంధం
కూడా
చరిత్రలో సంక్లిష్టమైందే. యూరపు
లోనే
వివిధ
దేశాల్లో ఈ సంబంధం వివిధ రకాలుగా ఉంది.
అలాగే
దేవుడిని నమ్మటానికి, లౌకికత్వం గురించి లోతుగా
ఆలోచించ టానికి
మధ్య
కూడా పరస్పర వైరుధ్యం ఏమీ
లేదు.
లౌకికత్వం పై
ప్రామాణిక రచనలు
చేసిన
వాళ్లలో ఒకరయిన
చార్లెస్ టేలర్
మంచి
క్రిస్టియన్. మన
దగ్గర
మతాన్ని లోతుగా
ఆలోచించి రాజ్యాంగాన్నీ రాసిన అంబెడ్కర్ కూడా మనిషికి మతం
చాలా
అవసరమని భావించారు. పైన
దేవుళ్ళు వుండరు, లౌకిక జీవితంలోనే మనిషి
తనని
తాను
నిరూపించుకోవాలి అన్న బుద్ధుడి మతమే కదా బౌద్ధం.
భావ
పరంగా,
చరిత్ర
పరంగా
ఇంత
సంక్లిష్టత వున్న
విషయాలని మనం
అర్ధం
చేసుకోకుండా మెర్సీ
తన
మతాన్ని వదులుకుంటేనే ప్రగతిశీలత, ప్రజాస్వామికత, లౌకికత
నిరూపించుకోగలుగుతుందని అనటం
ఏ రకంగా సరైంది?
వీటన్నికీ మించి అందరు విమర్శకులు పదే
పదే ప్రస్తావించిన ఇంకొక విషయం కవితలోని సాధారణ
సీత మత మార్పిడి. దీన్ని హిందూమతంపైన దాడిగా మితవాదులు కొంతమంది నిర్ధారిస్తే, మరి కొంత
మంది
అభ్యుదయ వాదులు మార్క్స్ చెప్పినట్లు అసలు మతమే మత్తు
మందనే ప్రస్తావన తెచ్చారు. క్రిస్టియన్ చర్చీలు సామ్రాజ్య వాదానికి మద్దతిచ్చాయని, భారత దేశంలో బయటి
డబ్బులతో హిందూ
మతంతో పోటీ పడుతూ అందరినీ తమ
మతంలోకి ఆహ్వానిస్తారని, విముక్తి చేసే
సామర్ధ్యం లేని/కోల్పోయిన మతమని వారి విమర్శల సారాంశం. వీటిలో
సత్యం
లేకపోలేదు. అయితే
భారత
దేశంలో
ఆధిపత్య కులాల
వారికి
కులం
అవసరం లేనట్లే, ఆయా ఆధిపత్య కులాల
ప్రగతిశీల వాదులకి మతం
అవసరం
కూడా
పెద్దగా ఉండదు.
ఏ మతానికి చెందిన వారయినా ఆధిపత్య కులాల
వారికి,
అసలు మత సంప్రదాయాలని పాటించక పోయినా
లౌకికంగా, సాంస్కృతికంగా, మత
సమూహంలో అందాల్సినవన్నీ (కొంత
ఇబ్బందులు కలిగినా) అందుతాయి. అవి పేరంటాలు కావచ్చు, పెళ్లిళ్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మంత్రి
పదవులు
కావచ్చు. అవి అందని
సామాజిక వర్గాల,
కులాల ప్రజలకి వ్యక్తులుగా, సమూహాలుగా మతము, మత సమూహాలు, మత
అస్తిత్వం చాలా
అవసరం. సామాన్య ప్రజలకి లౌకిక రాజ్యంలో దొరకని,
పొందలేని, సాధ్యపడని ముక్తి కోసమే కాక లౌకిక
అవసరాల -
తమకొక
అండ,
గౌరవం,
ఆత్మ
సమ్మానం, స్తైర్యం, కమ్యూనిటీ, విద్య, వైద్యం,
కుటుంబ
సభ్యుల
ఆరోగ్యం - కోసం మతం
అవసరం
పడుతుంది. ఇక్కడే మార్క్ మతం మత్తు మందు
అనే
ముందు, "మతం అణగారిన జీవి
నిట్టూర్పు, హృదయం లేని ఈ ప్రపంచానికి హృదయం,
ఆత్మ
లేని
ప్రపంచానికి ఆత్మ"
అని
కూడా
చెప్పాడని గుర్తుచేసుకోవాలి. దేవుడి
అవసరం
వున్నవాళ్ళు ఒక దేవుడు అందుబాటులో లేకుంటే వేరొక
దేవుడిని వెతుక్కుంటారు. సమాజం
నుండి
వేలి
వేయబడిన దళితులు, రాజ్యం
ప్రత్యక్ష, పరోక్ష
దాడులకు గురయ్యే ఆదివాసీలు తమని
ఆహ్వానించే మతాలని వెతుక్కోవటం మన దేశ చరిత్రలో ఒక
అంతర్గత భాగమని
అభ్యుదయ వాదులు
ఇప్పటికైనా గుర్తించక తప్పదు. అది ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు. మన రిపబ్లిక్ కి
మూలాలు
వేసిన
అంబెడ్కర్ తీసుకున్న బౌద్ధం
కావచ్చు. అవి
ఎటువంటి విముక్తికి దారి
తీస్తుందని ప్రశ్న
వాళ్ళు
కూడా
వేసుకుంటున్నారు. మెర్సీ
కవిత
దానిలో
భాగమే. ఈ ఎగుడు దిగుడు చరిత్రని మర్చిపోయి అన్ని కులాల వారు,
సామాజిక వర్గాల
వారు
మాకు
లాగే అన్ని మతాలని తిరస్కరించాలనే అమూర్తమైన భావన
ఎవరికీ
పనికొస్తుందో అర్ధం
చేసుకోవటం కొంచెం
కష్టంగా వుంది.
మెర్సీ సీత రాముడిని ధిక్కరించే కవితని అహంకారంతో రాసిందా, అజ్ఞానంతో రాసిందా, ఆక్రోశంతో రాసిందా అనే చర్చ చేసే వాళ్ళం
అందరం
కూడా
మన రాజ్యంగంలో భావ ప్రకటన స్వేచ్చ్తో పాటు
మత
స్వేచ్ఛ కూడా
ఒక
ప్రాధమిక హక్కే
నన్న
విషయం,
ఆ స్వేచ్చకీ గత దశాబ్దాల్లో అనేక
మత
మార్పిడి నిరోధక
చట్టాలు తెచ్చి
తూట్లు
పొడిచిన విషయం
కూడా
గుర్తుంచుకోవాల్సిన అవసరం
వుంది. మహారాష్ట్రలో 2014 నుండి 2018 వరకు ఎంత
మంది
మత
మార్పిడి చెందారని ఇన్ఫర్మేషన్ చట్టం
కింద
ప్రశ్న
అడిగితే 44% మంది
హిందువులు ఇస్లాం
ని
స్వీకరించారని, వివిధ
మతాల
వారు
22% హిందూ
మతాన్ని స్వీకరించారని క్రిందటి సంవత్సరం టైమ్స్
అఫ్
ఇండియా
ప్రచురించింది. మత
మార్పిడి గురించిన హిందుత్వ వాదుల బాధ, ఆందోళన హిందుత్వ వాదులు
చేసిన
అసహ్యకరమయిన ఘర్
వాపసీ
ప్రోగ్రామ్ లో
వ్యక్తమయింది. వీటన్నిటి మధ్యలో
అభ్యుదయ వాదులు తెలుగు క్రిస్టియన్ రచయిత్రి ఒక
సాధారణ
సీత మత మార్పిడి గురించిన కవిత
పట్ల
చేసిన
విమర్శ
మెజారిటీ వాదం
నిర్ణయించిన పరిధిలో చేస్తున్నారేమో నన్న సందేహం కలుగుతోంది. ఈ విమర్శకులు చారిత్రకంగా తమకు లభించిన సామాజిక స్తానం
నుండి
వచ్చిన
స్వీయానుభవాన్ని సార్వత్రిక సత్యంగా తీసుకోవట్లేదు కదా?
బహుశా
అందువల్లే కాబోలు ముస్లిం వాదులు, దళిత వాదులెవరు ఈ కవిత పట్ల అభ్యుదయ వాదులు
వ్యక్త
పరిచిన
సందేహాలేమీ వ్యక్తపరచలేదు. మైనారిటీ సమూహాలుగా, అణగారిన సమూహాలుగా వారి
సామాజిక అనుభవం ఈ కవితలో వున్న
సార్వత్రిక విమర్శని అర్ధం
చేసుకున్నట్లుంది.
Published in Bhumika, May 2019 Issue
Comments
Post a Comment